Unstoppable 2 : బావ‌మ‌రిది షోలో బావ

నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఓ వైపు రాజ‌కీయాల్లో రాణిస్తూనే.. మ‌రోవైపు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే బుల్లితెర‌పై కూడా సంద‌డి చేస్తున్నాడు. బుల్లితెర‌పై బాల‌య్య ప‌వ‌ర్ ఏంటో అన్‌స్టాప‌బుల్ షో ద్వారా ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌ముఖ ఓటీటీ యాప్ ఆహాలో అన్ స్టాప‌బుల్ ప్రోగ్రామ్‌కి అద్భుత‌మైన‌ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ షోకి ఇంత రెస్పాన్స్ రావ‌డానికి బాల‌య్యనే కార‌ణం.

బిగ్ స్క్రీన్ పై ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌లు చెబుతూ విల‌న్‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే బాల‌య్య‌ను ప్రేక్ష‌కులు త‌మ ఇళ్ల‌లో చాలా కూల్‌గా గెస్ట్‌ల‌తో ముచ్చ‌ట చెబుతూ జాలీగా వారిని న‌వ్విస్తూ చేసిన అన్ స్టాప‌బుల్ షోలో ఫ్యాన్స్ బాల‌య్య‌లో మ‌రో కోణాన్ని చూసారు. బాల‌య్య బాబులో ఈ యాంగిల్ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. అందుకే ఫ్యాన్స్ కోరిక మేర‌కు ఆహా యాజ‌మాన్యం ఈ ప్రోగ్రామ్ మ‌రో సీజ‌న్‌ని ప్లాన్ చేసింది.

ప్ర‌స్తుతం అన్‌స్టాప‌బుల్ షోకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు సీజ‌న్‌-2కి సంబంధించి ఆహా ఇచ్చిన అప్‌డేట్‌తో బాల‌య్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇంత‌కి ఆ అప్‌డేట్ ఏంటంటే అక్టోబ‌ర్ 14 నుంచి అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సీజ‌న్ ఫ‌స్ట్ గెస్ట్‌గా టీడీపీ అధినేత‌, బాల‌య్య వియ్యంకుడు చంద్ర‌బాబు నాయుడు వ‌స్తున్నారు. ఇటీవ‌లే షూటింగ్ కూడా పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. ఇక షో కోసం  బాల‌య్య‌, చంద్ర‌బాబు ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు