Chalaki Chanti : హోమ్ సిక్.. వాస్తవమెంత ?

బిగ్ బాస్.. ఎక్కడో హాలీవుడ్ లో స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో తెలుగు రాష్ట్రాల వరకు చేరింది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుంది. ఇటీవలే ఆరో సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తికాగా, ఐదో వారం కూడా పూర్తి కాబోతుంది. ఈ నాలుగు వారాల్లో షాని సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరీ, ఆరోహి రావు ఎలిమినేషన్ అయ్యారు. తాజాగా ఐదో వారం కూడా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే ఈ ఐదో వారం ఎలిమినేషన్ పై బయట గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. హౌస్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన జబర్ధస్త్ ఫేం చలాకీ చంటి ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా బాలాదిత్యా, మెరీనాలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని టాక్ వచ్చింది. కానీ, అనూహ్యంగా గత రెండు రోజుల నుంచి చంటి పేరు తెరపైకి వచ్చింది. అయితే చంటి ఎలిమినేషన్ డైరెక్ట్ గా కాకుండా.. సెల్ఫ్ ఎలిమినేషన్ అని తెలుస్తుంది.

నాగార్జున, బిగ్ బాస్ తో చంటి ప్రత్యేక రూంలో మాట్లాడి సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడని టాక్. దీనికి కారణం ఆయన హోమ్ సిక్ తో ఉంటున్నాడట. గత రెండు రోజుల నుంచి హౌస్ లో కూడా యాక్టివ్ గా ఉండటం లేదు. అలాగేే భోజనం కూడా చేయడం లేదు. బిగ్ హౌస్ అంటేనే ఇంట్రెస్ట్ లేనట్టు వ్యవహరిస్తున్నాడు. వీలైనంత త్వరగా హౌస్ నుంచి బయట పడాలి అనే ఫీలింగ్ తో చంటి కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని సూర్యతో కూడా చంటి చెప్పాడు.

- Advertisement -

అయితే చంటి అర్ధంతరంగా వెళ్లడం పై చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. చంటీ హౌస్ లో ఏమీ చెప్పినా వర్క్ అవుట్ కావడం లేదు. ఆయన ప్లాన్స్ కూడా తెలిపోతున్నాయి. పైగా చంటి పై అడియన్స్ లో చిన్నపాటి నెగిటివిటీ కూడా వస్తుంది. దీన్ని చంటి గ్రహించి హౌస్ లో ఉంటే.. క్రేజ్ పెరగడం అటుంచి.. తగ్గితే చెప్పలేం అనే భావనలో ఉన్నాడని అర్థమవుతుంది. అందుకే చంటి హౌస్ నుంచి వెళ్లిపోవడానికి సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే.. చంటి బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు