Hansika Motwani: హీరోయిన్ కొత్త కాపురంలో అప్పుడే గొడవలా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక మోట్వానీ, కొన్ని రోజుల్లోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ హోదా ను తెచ్చుకుంది. హన్సిక ఎంత వేగంగా కెరీర్ ను నిర్మించికుందో.. అంతే వేగంగా కెరీర్ డౌన్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తోంది. కానీ, హిట్స్ మాత్రం అందుకోవడం లేదు. అలాగే హన్సిక సినిమాల పరంగా కంటే.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన లవ్.. మ్యారేజ్ తో చాలా సార్లు వార్తల్లోకి ఎక్కింది.

శింబుతో ప్రేమాయాణం అయితే పెళ్లి వరకు వెళ్లింది. కానీ, మధ్యలోనే బ్రేక్ పడింది. తాజాగా ఈమె తన స్నేహితురాలు భర్త అయిన సోహైల్ కతురియను పెళ్లి చేసుకుంది. ఇది కూడా చాలా రోజులు ట్రెండింగ్ లో ఉంది. హన్సిక, సోహైల్ పెళ్లి జైపూర్ లోని ఓ భారీ ప్యాలెస్ లో జరిగింది. ఈ పెళ్లి వేడుకను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ షూట్ చేసింది. లవ్ షాది డ్రామా పేరుతో వీరి పెళ్లిని ప్రస్తుతం హాట్ స్టార్ స్ట్రీమ్ చేస్తోంది. పెళ్లితో పాటు హన్సిక, సోహైల్ తో పాటు కుటుంబ సభ్యుల జీవితాన్ని కూడా దీనిలో చూపించారు.

అయితే ఈ లవ్ షాది డ్రామాలో.. హన్సిక ఫ్యామిలీకి, సోహైల్ ఫ్యామిలీకి జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని కూడా చూపించారు. వీరి పెళ్లి సమయంలో సోహైల్ కుటుంబ సభ్యులు ఆలస్యంగా వచ్చారట. దీంతో హన్సిక తల్లి మోనా.. మీరు ఆలస్యంగా వస్తే ప్రతి నిమిషానికి 5 లక్షల రూపాయలు చెల్లించాలని సోహైల్ తల్లిదండ్రులను డిమాండ్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక తల్లి మోనా లవ్ షాది డ్రామాలోని ఓ ఎపిసోడ్ లో చెప్పింది.

- Advertisement -

ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హన్సిక కొత్త కాపురంలో పెళ్లి రోజు నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయా ? అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం హన్సిక, సోహైల్ తమ వైవాహిక జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు