House of The Dragon 2 : ఆ సీన్స్ కట్ చేశారంటూ నెటిజన్లు ఫైర్… ఓటిటికి కొత్త తలనొప్పి

House of The Dragon 2 : ఓటిటీ మూవీ లవర్స్ కు గేమ్స్ ఆఫ్ త్రోన్స్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఈ వెబ్ సిరీస్ 8 భాగాలుగా ప్రసారమై ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను దక్కించుకుంది. ఆ తరువాత గేమ్స్ ఆఫ్ త్రోన్స్ కు ఫ్రీక్వల్ గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ను రూపొందించారు మేకర్స్. 2022లో రిలీజ్ అయిన ఈ సిరీస్ కు కూడా అద్భుతమైన ఆదరణ దక్కడంతో రికార్డు స్థాయిలో వ్యూస్ కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఓటిటిలోకి వచ్చేసింది. అయితే ఈ సిరీస్ గురించి ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన మూవీ లవర్స్ కు తీరా చూశాక నిరాశ తప్పట్లేదు. ఇందులో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీన్లు కనిపించకపోవడంతో, సెన్సార్ చేశారు అంటూ గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. మరి నెటిజన్ల అల్లరికి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటిటి సంస్థ ఎలాంటి సమాధానం చెప్పిందో తెలుసుకుందాం పదండి.

సెన్సార్ కాదు టెక్నికల్ ఎర్రర్

సోషల్ మీడియాలో ప్రస్తుతం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 విషయంలో జియో సినిమా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఈ సిరీస్ లోని అభ్యంతరకర సన్నివేశాలను జియో సెన్సార్ చేసిందని జోరుగా చర్చ నడుస్తోంది. జియో సినిమాలో కంటే ముందే మ్యాక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ జియో సినిమాలో ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ మ్యాక్స్ లో ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ కంటే తక్కువ డ్యూరేషన్ లో ఉందని ఆరోపిస్తున్నారు నెటిజన్లు. మ్యాక్స్ లో ప్రసారమవుతున్న తొలి ఎపిసోడ్ నిడివి 58 నిమిషాలు ఉంటే, జియోలో మాత్రం 55 నిమిషాలే ఉందని చెప్తున్నారు. ఈ మూడు నిమిషాలకు సంబంధించిన సీన్స్ ను జియో సినిమా సెన్సార్ చేసిందని అంటున్నారు.

House of the Dragon Season 2: Where to watch the much-awaited Game of  Thrones spinoff

- Advertisement -

ఈ విషయంపై జియో సినిమా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ ను సెన్సార్ చేయలేదని, డ్యూరేషన్ తగ్గడం అనేది కేవలం టెక్నికల్ అంశం మాత్రమే అవుతుందని క్లారిటీ ఇచ్చింది. కానీ ఆ టెక్నికల్ కారణాలు ఏంటి అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే గేమ్ ఆఫ్ త్రోన్స్ అంటేనే హింస, సెన్సార్ లేని బోల్డ్ సీన్స్. అలాంటిది తాజాగా రిలీజ్ అయిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2లో అవేవీ లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తోంది.

రెండు ఓటిటిలలో సీజన్ 2

హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 2 జూన్ 16 నుంచి మ్యాక్స్ ఓటీటీలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది. జూన్ 17 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులో ఉండడం విశేషం. కానీ బోల్డ్ సీన్స్ విషయంలో నెటిజన్ల అలకను జియో సినిమా వారు ఎలా తీరుస్తారో మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు