Japan : ఓటీటీ రిలీజ్ కు భారీ ఆఫర్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన కు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కార్తీ మొదటి సారి తెలుగులో అక్కినేని నాగార్జునతో ఊపిరి సినిమాలో చేశాడు. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కాగా కార్తీ నుంచి ఇటీవల వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1, సర్దార్ వంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచియి. అలాగే వీటి ముందు వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పొన్నియిన్ సెల్వన్1, సర్దార్ వంటి హిట్స్ తర్వాత కార్తీ ప్రకటించిన తర్వాత సినిమా జపాన్. యంగ్ డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వంలో విభిన్నమైన కథతో ఈ జపాన్ చిత్రం రాబోతుంది. దీనిలో కార్తీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఇదిఇలా ఉండగా ఈ చిత్రం విడుదల కాకముందే ఓటీటీ రిలీజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం అందుతుంది.

నెట్ ఫ్లిక్స్ తో పాటు మరో రెండు ఓటీటీ సంస్థలకు కూడా పోటీ పడ్డాయట. కానీ నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ ను ప్రకటించడంతో జపాన్ టీం చివరికి నెట్ ఫ్లిక్స్ వైపునకు మొగ్గుచూపిందని టాక్. అయితే జపాన్ ఓటీటీ రైట్స్ కి నెట్ ఫ్లిక్స్ ఎంత ఖర్చు చేసిందో అనేది మాత్రం తెలియాల్సింది. కానీ, ఈ ఓటీటీ డీల్ కార్తీ కెరీర్ లోనే బెస్ట్ అని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు