OTT : టాప్ 10లో జిన్నా

మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో చేసిన సినిమా జిన్నా. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ అందించగా, ఇషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు నిర్మించగా, అనుప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు. కాగా ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లోకి వచ్చింది. సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. ఆ సమయంలో థియేటర్ లో ఉన్న ప్రిన్స్, సర్దార్ సినిమాలకు జిన్నా మంచి పోటీని ఇచ్చింది.

తాజాగా ఈ సినిమా డిసెంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓటీటీలోనూ దుసుకెళ్తుంది. అమెజాన్ లో జిన్నా చిత్రం ప్రస్తుతం టాప్ 10 లో కొనసాగుతోంది. భారతదేశ వ్యాప్తంగా అన్ని భాష సినిమాల్లో 7వ స్థానంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. జిన్నా చిత్రం ఓటీటీలోకి వచ్చి కేవలం మూడు రోజులకే ఇలాంటి రికార్డు నమోదు చేసింది.

ఈ సినిమా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే థియేటర్ లో సక్సెస్ ఫుల్ రన్ అయిన జిన్నా, ఇప్పుడు ఓటీటీలో కూడా ట్రెండింగ్ లో కి రావడం మంచు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు