Kantara : కంటెంట్ బాగుండడంతో కాస్త ఆలస్యం

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ‘కాంతార’ గురించే చర్చ కొన‌సాగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా కన్నడలో కంటే తెలుగులోనే మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాను తెలుగులో  గీతా ఆర్ట్స్ బ్యానర్ పై  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు.

అక్టోబర్ 15, 2022 విడుద‌లై ఇక్కడ కూడా భారీ వసూళ్ల‌ను రాబడుతోంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా ఎవరు తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో విజయ దుందుభి మోగించడంతో ఈ సినిమా ఓటిటి రిలీజ్ లేట్ అవుతుంది.

వాస్త‌వానికి ఈ పాటికి కాంతార ఓటీటీ నుండి రిలీజ్ కావాల్సి ఉంది. అంటే నవంబర్ మొదటి వారంలోనే కాంతార అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇంకా థియేట్రికల్ రన్ పూర్తి కాకపోవడంతో, ఓటీటీ రిలీజ్ డేట్ వాయిదా పడింది. థియేటర్లలో ఇప్పటికీ మూవీ రన్ అవుతూ కలెక్షన్స్ తెస్తుండడంతో, ఈనెల 18 వరకు ఓటిటీ రిలీజ్ కి ఆగాలని కాంతార ప్రొడ్యూసర్ అమెజాన్ ప్రైమ్ ని కోరినట్లు తెలుస్తోంది. దానికి అమెజాన్ కూడా అంగీకారం తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. మరి బ్లాక్ బస్టర్ మూవీ కాంతారని ఓటీటీలో చూసేందుకు ఈనెల 18 వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు