Karthi : ఓటీటీకి బిగ్ హిట్ మూవీ

తమిళ హీరో కార్తీకి టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన ప్రతీ సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతోంది. యుగానికొక్కడు, ఆవారా, ఖాకి, ఖైదీ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు కార్తీ. తెలుగులో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో కూడా నటించాడు. ఇవే కాదు ఇటీవలే మణిరత్నం నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కూడా కార్తీ నటన అద్భుతమనే చెప్పాలి. అన్నయ్య సూర్య లాగే హిట్లు,  ఫ్లాప్ లు అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తున్నాడు. 

తాజాగా సర్దార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పీ.ఎస్. మిత్రన్-కార్తి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సర్దార్. ఈ సినిమాకి థియేటర్లలో మంచి స్పందన లభించింది. ఈ సినిమా తమిళం, తెలుగు రెండింటిలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్  ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 18న సర్దార్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది ఆహా టీమ్. 

అక్టోబర్ 21, 2022న థియేటర్లలో విడుదలైంది సర్దార్ సినిమా. ఇందులో కార్తీ సరసన రాశీఖన్నా, రజిష విజయన్ నటించారు. లైలా కీలక పాత్ర పోషించారు. ఇందులో కార్తీ ఆరు విభిన్న గెటప్ లలో కనిపించారు. భారీ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను ప్రేక్షకులు వీక్షించారు. ప్రిన్స్ పిక్చర్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. ఈ చిత్రం ఓటీటీలో ఏ రేంజ్ లో అలరిస్తుందో లేదో  వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు