Macherla Niyojakavargam : ఓటీటీ డేట్ ఖరారు

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ నుంచి ఇటీవల వచ్చిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. కొత్త దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, శ్రేష్ట మూవీస్ పతాకం పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించారు. నితిన్ కు జోడీ గా కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడులైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత హిట్ సాధించలేకపోయింది.

ఈ సినిమా ప్రమోషన్ల నుంచే పెద్దగా అంచనాలు క్రియేట్ కాలేదు. పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులపై ప్రభావం చూపలేవు. ఒక రా.. రా.. రెడ్డి సాంగ్ మాత్రమే ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఒక పాటతో సినిమా విజయం సాధించడం కష్టమే. అందుకే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి మొదట మిశ్రమ టాక్ రావడంతో చాలా మంది థియేటర్ లో చూడలేదు. ఓటీటీలోకి వచ్చాకా చూద్ధమని అనుకున్నారు.

కానీ ఈ చిత్రం విడుదలై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఓటీటీలోకి రాలేదు. దీంతో మాచర్ల నియోజకవర్గం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. మాచర్ల నియోజకవర్గం ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. డిసెంబర్ 9వ తేదీన ప్రముఖ ఓటీటీ జీ5 లో ప్రసారం చేయనున్నారు. అంటే సినిమా థియేటర్ లోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు