Unstoppable : పవన్ తో నందమూరి వారసుడు

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షో వస్తున్న విషయం తెలిసిందే. దీనికి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ షోకు గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. మంగళవారం షూటింగ్ కూడా జరిగింది. దీంతో సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ ఇలా ఎక్కడా చూసినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలయ్య, అన్ స్టాపబుల్ పేర్లే వినిపించాయి. ట్విట్టర్ అయితే షేక్ అయిపోయింది.

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షం కావడంతో నందమూరి, మెగా ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోయారు. కాగా ఈ షోకు పవన్ కళ్యాణ్ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, హరి హర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కూడా వచ్చారు. వీరితో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చాడని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ టాక్ షోకి వచ్చిన వారి విషయంలో మరో పేరు వినిపిస్తుంది. అతనే నందమూరి వారసుడు మోక్షజ్ఞ.

మోక్షజ్ఞ ను తెలుగు సిల్వర్ స్క్రిన్ కు పరిచయం చేయాలని బాలయ్య చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎదో ఒక అడ్డంకి రావడం, ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. మోక్షజ్ఞ కోసం ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 అనే స్టోరీ ఉందని, దానికి తానే దర్శకత్వం వహిస్తానంటూ కూడా బాలయ్య చెప్పుకొస్తున్నాడు. మరీ ఈ ఎపిసోడ్ లో మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి ఉండేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

అందుకే పవన్ ఎపిసోడ్ కు మోక్షజ్ఞ ను బాలయ్య తీసుకువస్తున్నాడని కూడా అంటున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై పూర్తిగా తెలియాలంటే ఫైనల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు