ori devuda : ఓటీటీ లాక్..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న హీరోలు చాలా తక్కువగానే ఉన్నారు. అందులో ఒకరు విశ్వక్ సేన్. ఫ‌ల‌క్‌నుమా దాస్ సినిమాతో పెద్ద స్టార్ అయిపోయాడు విశ్వక్. ఈ సినిమాతోనే యూత్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.

ఆ తరువాత పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో మంచి విజయం అందుకున్న విశ్వక్‌సేన్‌.. ప్రస్తుతం ” ఓరి దేవుడా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడవలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళంలో దర్శకత్వం వహించిన మరిముత్తు తెలుగులోనూ తెరకెక్కిస్తుండడం విశేషం.అశ్వత్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి మిథిలా పాల్కర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. పీవీపీ సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ కూడా ఒక భాగం.

లియోని జేమ్స్ సౌండ్ ట్రాక్ లను అందించగా.. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ డిఫరెంట్ పాత్రకి ఓకే చెప్పినట్లు సమాచారం. అదికూడా ఓ దేవుడి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. తాజా సమాచారం ఏమిటంటే.. ప్రముఖ ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు