OTT: సార్ వచ్చేస్తున్నాడు…

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయి పెద్ద విజయాన్ని నమోదు చేశాయి. ఇలా ధనుష్ కు తెలుగు అభిమానులతో పాటు మంచి మార్కెట్ కూడా పెరిగింది. దీంతో ధనుష్ నేరుగా తెలుగు మూవీ చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేశారు. అలా వచ్చిందే.. సార్ మూవీ.

తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 17న థియేటర్ లలో రిలీజ్ అయింది. తమిళంలో వాతీ, తెలుగులో సార్ పేరుతో రిలీజ్ అయిన మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను ఇంకా థియేటర్స్ లో అలరిస్తుంది. దీనిలో ధనుష్ కు జోడీగా సంయుక్త నటించింది.

ఈ చిత్రం మొత్తం ఎడ్యుకేషన్ బేస్డ్ అని, ఒక సోషల్ డ్రమాటిక్ చిత్రం అని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అలాగే విద్యా వ్యాపారం వంటి అంశాన్ని డైరెక్టర్ చక్కగా చూపించారు. అయితే ఫాన్స్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని వేచి చూస్తున్నారు.

- Advertisement -

అలాంటి వారికి తాజాగా మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. సార్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 17 నుంచి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినవాళ్లు.. ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు