OTT Movie : భర్త అక్రమ సంబంధం… ఆ భార్య రివేంజ్ చూస్తే పార్ట్స్ అన్నీ ప్యాక్ అయిపోతాయి

OTT Movie : అక్రమ సంబంధం అనేది ఎప్పుడూ హాట్ టాపికే. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ఏదో ఒక రకంగా ఇలాంటి వార్తలను వినడం చూడడం వంటివి చేస్తూనే ఉన్నాము. పక్కింటి దగ్గర్నుంచి సినిమాల వరకు ఇదొక సర్వసాధారణమైన కేస్ అయిపోయింది. కానీ ఇలాంటి వల్ల ఫ్యామిలీలో అనవసరమైన గొడవలతో పాటు, కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. ఎంతోమంది సెలబ్రిటీల జీవితాలు అక్రమ సంబంధాల వల్ల దెబ్బ తినడం మనం చూశాము. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్లు దానివల్ల జరిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటి జోలికి వెళ్లరు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి అఘాయిత్యాలు ఎన్ని చూస్తున్నప్పటికీ ఎఫైర్ లు కొనసాగిస్తారు. అలా ఆలోచించే వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ చూస్తే పార్ట్స్ అన్ని ప్యాక్ అవ్వాల్సిందే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? టైటిల్ ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది వెబ్ సిరీస్ గురించి. పరాయి అమ్మాయి కోసం పాకులాడే భర్తకు ఆ భార్య ఎలా సమాధానం చెప్పింది అన్నదే ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్ పేరు అవుట్ ఆఫ్ లవ్. పాపులర్ ఓటిటి ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ అవుతోంది. దీనికి సంబంధించి మొత్తం రెండు సీజన్ లు అందుబాటులో ఉండగా, ఒక్కసారి చూడడం స్టార్ట్ చేశారంటే ఆపడం చాలా కష్టం. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో, ఆసక్తికర మలుపులతో రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండే ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Hotstar Specials Out Of Love 2 Official Trailer | Rasika Dugal | Purab  Kohli | 30 April

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఓ భర్తకు బంగారం లాంటి భార్య, కొడుకు ఉండగా, వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటాడు. భర్త బట్టలలో దొరికిన వెంట్రుకతో ఆ భార్య అసలు విషయాన్ని కనిపెడుతుంది. ఆ తర్వాత రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకుని కడిగేస్తుంది. ఇంకేముంది ఇంత జరిగాక, స్వయంగా చూశాక ఆమె అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళే ముందు అతనేంటి అనేది అందరికీ అర్థమయ్యేలా చూపించే, కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. దీంతో సీజన్ వన్ కి ఎండ్ కార్డ్ పడుతుంది.

సెకండ్ సీజన్ లో రివేంజ్ డ్రామా మొదలవుతుంది. భర్త తిరిగి వస్తాడు. కానీ కొత్త భాగస్వామితో కలిసి వస్తాడు. తన మాజీ భార్య మీద పగ తీర్చుకోవాలి, కొడుకుని సొంతం చేసుకోవాలి అనే ఆలోచనతో ఈ పని చేస్తాడు. మరి అలాంటి వాడికి ఆ భార్య ఎలా సమాధానం చెప్పింది ? ఈ రివేంజ్ డ్రామాలో గెలిచిందెవరు? భార్య తన కొడుకుని కాపాడుకుందా ? భర్త వేసిన ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేసింది? తప్పు చేసింది చాలాక రివెంజ్ కోసం తిరిగి వచ్చిన ఆ భర్త పరిస్థితి చివరికి ఏమైంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే అవుట్ ఆఫ్ లవ్ సీజన్ 2 సిరీస్ ను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు