PSPK :బాబాయ్ సీక్రెట్స్ చెప్పిన అబ్బాయ్..

నందమూరి నటసింహ బాలయ్య హోస్ట్ చేస్తున్న “అన్ స్టాపబుల్” రెండవ సీజన్ ఆఖరి ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ తొలిభాగం గురువారం రాత్రి ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చింది. తొలిభాగం చాలా సరదాగా సాగింది.

ఈ షోలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కూడా పాల్గొని సందడి చేశారు. పవన్ కళ్యాణ్ ను భయ్యా అంటూ సరదాగా పిలిచిన బాలయ్య ఆయన దగ్గర నుంచి సమాచారం బాగానే రాబట్టారు. బాలయ్య అడిగిన అన్ని ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ చాలా వివరంగా జవాబులు ఇచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ మధ్యలో బాలయ్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఫోన్ చేసి.. పవన్ కళ్యాణ్ సీక్రెట్స్ గురించి చెప్పాలని అడిగారు.

దీనికి రామ్ చరణ్ జవాబిస్తూ.. “బాబాయ్ జీవితంలో బోరింగ్, సీక్రెట్స్ ఏమీ ఉండవు. బాబాయ్ కి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వారంలో ఏడు రోజులు తినమన్నా తింటారు. ఇద్దరం కలిసి సింగపూర్ వెళ్ళాం. అక్కడ ఆయనని చాలా ఇబ్బంది పెట్టాను” అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చివరలో ఫోన్ పెట్టేసే సమయంలో “జాగ్రత్తరా ఉంటా” అంటూ పవన్ చెప్పడం.. ఇదంతా చూస్తూ బాలయ్య ఏం క్యూట్ ఫ్యామిలీ అయ్యా మీది అంటూ ప్రశంసలు గుప్పించడంతో ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుంది.

- Advertisement -

ఇక సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆసుపత్రిలో సాయి ధరంతేజ్ ని చూడగానే చాలా బాధ అనిపించిందని, రెండు మూడు రోజులు గడిచినా పరిస్థితి విషమంగానే ఉందని చెప్పడంతో చాలా కంగారు పడ్డాను అని చెప్పారు పవన్ కళ్యాణ్

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు