Rana-Venkatesh: రానా నాయుడు సిరీస్ కాదు.. బ్లూ ఫిలిం

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ రానా నాయుడు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ ఉంటుంది. ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చి తొమ్మిది రోజులు గడుస్తున్నా.. దీని గురించే చర్చ జరుగుతుంది. దీనికి కారణం, ఈ సిరీస్ లో ఫ్యామిలీ హీరో దగ్గుబాటి వెంకటేష్ తో పాటు రానా కలిసి నటించడం. సాధారణంగా, బాబాయి, అబ్బాయి కలిసి నటిస్తే ఒక మంచి కంటెంట్ ఉంటుందని అందరూ ఊహిస్తారు. అందులోనూ విక్టరీ వెంకటేష్ ఉంటే, ఇంకెంత బాగుంటుందో అని ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు అనుకున్నారు.

కానీ, సిరీస్ మొత్తం అడల్ట్, బోల్డ్ సీన్స్, బూతు, వల్గర్ డైలాగ్స్ తో నిండి ఉంది. దీంతో ఈ సిరీస్ విడుదలైన నాటి నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. ప్రేక్షకులే కాదు.. సెలబ్రెటీలు కూడా రానా నాయుడుపై స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, సెన్సార్ బోర్డు మాజీ మెంబర్ శివ కృష్ణ ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ స్పందించాడు.

తాను రానా నాయుడు సిరీస్ ను చూశానని, అది ఒక సిరీస్ లా లేదని, ఆల్మోస్ట్ ఒక బ్లూ ఫిల్మ్ లా ఉందని విమర్శించాడు. భార్య, భర్తలు బెడ్ రూంలో ఉన్నప్పుడు పిల్లలు చూడటమేంటి అని అన్నారు. “ఒక దేశం ఆర్థికంగా పతనమైనప్పుడు కోలుకోవడానికి కొంత సమయం తీసుకున్నా.. కోలుకుంటుంది. కానీ, దేశం సంస్కృతి పరంగా పతనమైతే, కోలుకోవడం చాలా కష్టం అని అన్నారు”. ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లు అంటే తప్పకుండా అడల్ట్ కంటెంట్ ఉండాలనే భావన ఉందని అన్నారు. ఇది పోవాలంటే, ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

అయితే, అడల్ట్, బోల్డ్ సీన్స్, బూతు, వల్గర్ డైలాగ్స్ పక్కన పెడితే, స్టోరీ పరంగా రానా నాయుడుకు మంచి రివ్యూలు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఈ వివాదాస్పద వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు