Rana Naidu: లెగసీని పక్కన బెట్టి.. ఇంతకి దిగజారారా ?

హోమ్లీ హీరో.. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ హీరో.. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే.. దగ్గుబాటి వెంకటేష్ గురించి, ఆయన నటించిన 71 సినిమాల గురించి ఒక బుక్కే రాయొచ్చు. తొలి సినిమా కలియుగ పాండవులు నుంచి ఇటీవల వచ్చిన F3, ఓరి దేవుడా సినిమాల వరకు వెంకటేష్ క్యారెక్టర్ కు, క్యారెక్టరైజేషన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.. బీభత్సమైన క్రేజ్ ఉంది. వెంకీ కెరీర్ లో “ప్రేమించుకుందం రా” “పెళ్లి చేసుకుందాం” “సూర్యవంశం” “రాజా” “కలిసిందాం రా” “నువ్వు నాకు నచ్చావు” తో పాటు పదుల సంఖ్యలో క్లాసికల్ హిట్స్ ఉన్నాయి.

అలాంటి హీరో నుంచి ఒక సినిమా వస్తే.. సాధారణ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ, రానా నాయుడు వెబ్ సిరీస్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. దీనిలో ఫ్యామిలీ ఎలిమేంట్స్ లేకపోగా.. పచ్చి బూతు డైలాగులు, అతి వల్గారిటీ ఇంకా చెప్పాలంటే.. తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం అంగీకరించని సీన్స్, డైలాగ్స్ ఉన్నాయి. మొదటి ఎపిసోడ్‌లో.. మొదటగా వచ్చే సీన్ చూస్తేనే తెలుస్తోంది ఈ సిరీస్ ఎలాంటిదని, ఎలా ఉండబోతుందని. అలాగే ఈ సిరీస్ లో దగ్గుబాటి హీరోలు ఎలా నటించారనే ప్రశ్న కూడా రాక మానదు.

వెంకటేష్ గానీ, రానా గానీ ఇప్పటి వరకు వారి వారి కెరీర్ లో ఇలాంటి సినిమాలు చేయలేరు. మరి ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందో వారికే తెలియాలి. డబ్బు కోసం చేశారా అంటే ?

- Advertisement -

దగ్గుబాటి ఫ్యామిలీ గురించి అందిరికీ తెలుసిందే. రామా నాయుడు స్టూడియోస్ తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్.. సురేష్ బాబు, సీనియర్ నిర్మాత రామానాయుడు అలాగే విక్టరీ వెంకటేష్ అందరు కలిసి కావాల్సినంత సంపాదించారు. ఇలాంటి వారికి డబ్బు అనేది పెద్ద సమస్య కాదు. అయినా, ఇలాంటి సిరీస్ లో ఎందుకు నటించారు అనేది ప్రస్తుతం అందరి నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి దగ్గుబాటి హీరోలే సమాధానం చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు