OTT: చడీ చప్పుడు లేకుండా వచ్చిన రవితేజ

ప్రస్తుత కాలంలో ఓటీటీలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. “ఎంతటి సినిమా అయినా, నాలుగు వారాలు కాకపోతే, ఆరు వారాలకైనా ఏదో ఒక ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఇంత మాత్రం దానికి థియేటర్స్ కి ఏం వెళ్లాలి” అనే భావనలో ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో కుటుంబంతో కలిసి థియేటర్స్ కి వెళితే, ఎంత కాదన్నా… 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే డబ్బుతో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఇంట్లోనే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇది ఒక తెలుగులోనే కాదు.. అన్ని ఇండస్ట్రీలోనూ ఇదే పద్దతి ఉంది.

దీంతో ఓటీటీ యాజమాన్యాలు కూడా ప్రేక్షకులను ఇంట్రెస్ట్ ను క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలను కొన్ని వారాల్లోనే ఓటీటీల్లోకి తీసుకువచ్చేస్తున్నారు. థియేటర్స్ లో హిట్ అయిన మూవీలకు ఎక్కువ ఛార్జ్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు తక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఓటీటీ యాజమాన్యాలు. అయితే ఇక్కడ, ఫ్లాప్ అయిన సినిమాలపై ఇప్పటి వరకు ఓటీటీలు ఒక స్ట్రాటజీని ప్లే చేసే వాళ్లు. థియేటర్స్ లో నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలను త్వరగా ఓటీటీల్లోకి తీసుకువచ్చే వాళ్లు. అంతే కాకుండా, అది బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటూ ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మరీ ప్రచారం చేశారు.

కానీ, ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ మళ్లీ మారిపోయింది. థియేటర్స్ లో నెగిటివ్ టాక్ వస్తే, ఓటీటీల్లో కూడా ఆయా సినిమాలపై కన్నెత్తి చూడటం లేదు. దీంతో అలాంటి సినిమాలను ఓటీటీలు ప్రస్తుతం లైట్ తీసుకుంటున్నాయి. ఇటీవల థియేటర్స్ ఫ్లాప్ అయిన హంట్, రంగమార్తాండ సినిమాలకు ఓటీటీల్లోకి వచ్చే ముందు ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అలాగే తాజాగా రవితేజ నటించిన రావణాసుర మూవీ కూడా చడీ చప్పుడు లేకుండా ఓటీటీల్లోకి వచ్చేసింది. రావణాసుర ఏప్రిల్ 7న థియేటర్స్ లో వచ్చింది. ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అంటే కేవలం మూడు వారాల్లోనే రావణాసుర మూవీ ఓటీటీల్లోకి వచ్చేసింది.

- Advertisement -

దీంతో కంటెంట్ బాగాలేని సినిమాలు.. థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీలోకి వచ్చినా ఆడియన్స్ పట్టించుకోవడం లేదని దీనితో తెలిసిపోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు