Biggboss : సల్మాన్ స్థానంలో స్టార్ ప్రొడ్యూసర్

బాలీవుడ్ న‌టుడు, కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. బాలీవుడ్ వ‌రుస సినిమాల‌తో పుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిగ్‌బాస్ కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే స‌ల్మాన్ ఖాన్‌ ప్ర‌తీ సంవ‌త్స‌రం దీపావ‌ళికి ఏదో ఒక అప్ డేట్‌తో వ‌స్తుంటాడు.

కానీ ఈ సారి దీపావ‌ళి పండుగ‌కు కాస్త దూరంగానే ఉన్నాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా బిగ్‌బాస్ 16 శుక్ర‌వారం జ‌రిగిన స్పెష‌ల్ ఎపిసోడ్‌కి స‌ల్మాన్ హాజ‌రు కాలేదు. స‌ల్మాన్ స్థానంలో ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హాజ‌ర‌య్యాడు. తాజాగా స‌ల్మాన్ ఖాన్‌కి డెంగ్యూ సోకింద‌ని నిర్థార‌ణ అయింది. డెంగ్యూ కార‌ణంగానే బిగ్ బాస్ కి స‌ల్మాన్ హాజ‌రు కాక‌పోవ‌డంతో శుక్ర‌వారం ఎపిసోడ్‌కి క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. స‌ల్మాన్ స్థానంలో క‌రుణ్ జోహార్ రెండు వారాల హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం.

స‌ల్మాన్ పూర్తిగా కోలుకున్న త‌రువాత‌నే బిగ్‌బాస్ తో పాటు షెహ‌నాజ్ గిల్‌, పూజాహెగ్దేతో క‌లిసి కిసి కా భ‌ట్ కిసికి జాన్‌తో స‌హా అన్ని చిత్రాల షూటింగ్‌ల‌ను ప్రారంభిస్తాడు. స‌ల్మాన్ ఖాన్ చివ‌రి సారిగా మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి గాడ్ ఫాద‌ర్ సినిమాలో ప్ర‌త్యేక అతిథి పాత్ర‌లో క‌నిపించిన విష‌యం తెలిసిందే. క‌త్రినా కైఫ్‌తో క‌లిసి త‌న టైగ‌ర్ 3 చిత్రం దీపావ‌ళి 2023న విడుద‌ల‌వుతుందని ఇటీవలే ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ స్పెష‌ల్ గెస్ట్ క‌నిపించ‌నున్నారు. కిసికా భాయ్ కిసికి జాన్ సినిమా 2023 రంజాన్ పండుగ సంద‌ర్భంగా విడుద‌ల కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు