Sita Ramam : హిందీలో డేట్ ఫిక్స్

ఇటీవ‌ల విడుద‌లై సూప‌ర్ హిట్ సాధించిన సినిమా సీతారామం. ఈ ఏడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ చిత్రాల్లో సీతారామం సినిమా ఒక‌టి అనే చెప్పాలి. ప్ర‌ధానంగా ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌, సుమంత్, త‌రుణ్ భాస్క‌ర్‌, భూమిక చావ్లా, గౌతం వాసుదేవ్ మీన‌న్‌, వెన్నెల కిషోర్, ముర‌ళీ శ‌ర్మ, ప్ర‌కాశ్ రాజ్ త‌దిత‌ర పాత్ర‌దారులు ఈ చిత్రంలో నటించారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం మిలియ‌న్ల మంది ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకుంది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీతారామం, క‌ళ్యాణ్ రామ్ న‌టించిన బింబిసార రెండు సినిమాలు పోటీపోటీగా ఆగస్టు 5న  విడుదలయ్యాయి. రెండు సినిమాలు సూప‌ర్ హిట్ సాధించ‌డం విశేషం. తాజాగా సీతారామం హిందీ వెర్ష‌న్ ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సినిమాకి సంబంధించి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ వంటి వెర్ష‌న్లు ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల‌య్యాయి. హిందీ వెర్ష‌న్ మాత్రం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో న‌వంబ‌ర్ 18, 2022న ప్రసారం కానున్న‌ట్టు స‌మాచారం. స్వ‌ప్న సినిమా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందించారు. ఇప్ప‌టికే అన్ని వెర్ష‌న్ల‌లో థియేట‌ర్ల‌తో పాటు ఓటీటీలో కూడా సూప‌ర్ హిట్ సాధించింది సీతారామం. ఇక హిందీ వెర్ష‌న్‌లో అభిమానుల‌ను ఓటీటీలో ఆక‌ట్టుకుంటుందో లేదో వేచి చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు