Prince : ఓటీటీలోకి ఎప్పుడంటే ?

జాతి రత్నాలు చిత్ర దర్శకుడు అనుదీప్ నుంచి వచ్చిన తాజా చిత్రం ప్రిన్స్ . కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, ఇజ్రాయిల్ బ్యూటీ మారియా ర్యాబోషప్క హీరో, హీరోయిన్స్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఆక్టోబర్ 21న థియేటర్స్ లలో విడుదలైంది. అయితే తెలుగులో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోగా, తమిళంలో మాత్రం కాస్త‌ నిరాశపరిచింది.

తెలుగు అభిమానులకు ఈ చిత్రంలో కామెడీ ఫుల్ గా నచ్చింది. అయితే ఈ చిత్రం విడుదల అయ్యే సమయానికి కార్తీ నటించిన సర్దార్, విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా తో పాటు మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలు కూడా థియేటర్ లలో విడుదల అయ్యాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా పెద్దగా రాలేవు. అలాగే ప్రేక్షకులు కూడా ఎక్కువ మంది రాలేదు.

దీంతో ప్రిన్స్ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని  అందరూ ఆసక్తి దురుచూస్తున్నారు. అలాంటి వారికి మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ప్రిన్స్ చిత్రం హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయబోతుందని సమాచారం.  ఆ రోజు నుంచే ప్రిన్స్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రాబోతుంది.  అంటే సినిమా థియేటర్ లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీకి రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు