Smitha: “నిజం విత్ స్మిత” ను పట్టించుకునే వారే లేరు పాపం..!

ఇటీవల పలు ఓటిటిలు కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు టాక్ షోలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఓటిటిలో టాక్ షోని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి స్టార్స్ మద్దతు ఇచ్చి అతిథులుగా హాజరైనా ప్రయోజనం ఉండదు. ఓసారి సమంత హోస్ట్ గా ” సామ్ జామ్” పేరుతో ఒక సీజన్ షూట్ చేసి వదిలారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలను సైతం పిలిచి ఎపిసోడ్స్ చేశారు. ప్రయోజనం మాత్రం శూన్యం. స్టార్స్ వచ్చినా వ్యూయర్షిప్ రాలేదు. ఆ దెబ్బతో సామ్ జామ్ ని డస్ట్ బిన్ లో పడేశారు.

అలా కొంచెం గ్యాప్ ఇచ్చి బాలయ్యతో అన్ స్టాపబుల్ ఆలోచన చేసి బిగ్ సక్సెస్ అయ్యారు. ఇక అన్ స్టాపబుల్ సక్సెస్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ టాక్ షోలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్ స్టాపబుల్ తర్వాత సోనీ లీవ్ లో స్మిత హోస్ట్ గా ఒక టాక్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షో కి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ షో ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించడం లేదు. ఎక్కువమంది ఈ కార్యక్రమాన్ని చూడడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. త్వరలోనే ఈ కార్యక్రమం మొదటి సీజన్ పూర్తి అవుతుంది. ఈ షో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రెండో సీజన్ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగర్ స్మిత ఎంతో కష్టపడి చేస్తున్నప్పటికీ, సోనీ లివ్ వారు ఎక్కువగా ఖర్చు చేసి రూపొందిస్తున్నప్పటికీ ఈ షోను జనాలు చూడకపోవడం పట్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు