Sushmita Sen : రీ ఎంట్రీలో కొత్తగా..

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ అంటే తెలియని వారు ఉండరు. హైదరాబాద్ కు చెందిన ఈ భామ 1994 లోనే విశ్వ సుందరి కిరిటాన్ని దక్కించుకుంది. తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. 2010 నో ప్రబ్లమ్ అనే సినిమా చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 2015లో ఒక బెంగాలి సినిమాలో కనిపించింది. తర్వాత మరోసారి ల్యాంగ్ గ్యాప్ తీసుకుంది ఈ మాజీ విశ్వ సుందరి.

అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల కంటే ఓటీటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆర్య అనే వెబ్ సిరీస్ తో ఈ మాజీ ప్రపంచ సుందరి రీ ఎంట్రీ ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా ఆర్య-2 లోనూ నటించింది. తాజాగా మరో వెబ్ సిరీస్ కు సుస్మితా సేన్ గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. రావి జాదవ్ దర్శకత్వంలో వస్తున్న తాలి అనే వెబ్ సిరీస్ లో సుస్మితా సేన్ నటిస్తుంది.

ఈ వెబ్ సిరీస్ లో ట్రాన్స్ జెండర్ గా సుస్మితా సేన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఈమె ఫస్ట్ లుక్ ను టీం విడుదల చేసింది. ఈ వెబ్ సిరీస్ లో ముంబయికి చెందిన రియల్ ట్రాన్స్ జెండర్ గౌరీ సావంత్ జీవిత కథ ఆధారంగా ఈ తాలి అనే వెబ్ సిరీస్ రాబోతుంది. గణేష్ గా పుట్టిన గౌరీ సావంత్.. ట్రాన్స్ జెండర్ గా మారిన కథ ఈ వెబ్ సిరీస్ లో ఉండనుంది.

- Advertisement -

కాగా గౌరీ సావంత్.. అన్నింటిలో మగ, ఆడ తో పాటు ట్రాన్స్ జెండర్ ను థర్డ్ జెండర్ గా గుర్తించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో గౌరీ సావంత్ విజయం సాధించింది. గౌరీ సావంత్ పోరాటంతో 2014 నుంచి ట్రాన్స్ జెండర్స్ ని థర్డ్ జెండర్స్ గా ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు