Venkatesh: 36 ఏళ్ల ఇమేజ్ గోవిందా…

తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఆయన సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు. వెంకీ వెండితెరపై కనిపిస్తే చాలు ఆ సినిమా సక్సెస్ అనే పేరు సంపాదించుకున్న అతను 1960 డిసెంబర్ 13వ తేదీన గుంటూరు జిల్లా కారంచేడు లో జన్మించారు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్.

టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి దగ్గుపాటి రామానాయుడు అండతో తొలి అడుగులు వేసినా.. తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్ని రకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. 1990వ దశకంలో వచ్చిన సినిమాలన్నీ విజయ పరంపర కొనసాగడంతో విక్టరీ ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. చాలామంది దగ్గుపాటి వెంకటేష్ అంటే ఎవరో తెలియదు అంటారు. అయితే విక్టరీ వెంకటేష్ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు.

60 ఏళ్ల వయసులో కూడా ఆయనకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి అంటే దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అని చెప్పొచ్చు. కానీ రీసెంట్ గా విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ చూస్తే.. 36 ఏళ్ల నుండి ఆయన సంపాదించుకున్న మంచి పేరు కాస్తా చెడిపోయింది అనే భావన కలుగుతుంది. రానా, వెంకటేష్ కలిసి చేసిన ఈ సిరీస్ లో లెక్కలేనన్ని బూతులు ఉన్నాయి. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంత దారుణమైన బూతు పదాలను ఎలా ఎంకరేజ్ చేశాడో అర్థం కాలేదు.

- Advertisement -

పైగా ఇందులో కొడుకు పాత్రలో రానా నటించాడు. వెంకీ మామ కి ఇలాంటి ఒక బూతు సిరీస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. కుటుంబంతో కలిసి ఈ సిరీస్ ని చూడడం జరిగే పని కాదు. ఈ సిరీస్ కి ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ కూడా రాలేదని తెలుస్తోంది. చిన్న సినిమాలు సైతం రెండు మిలియన్ల వ్యూస్ ని ఈజీగా సొంతం చేసుకుంటుంటే వెంకటేష్ లాంటి హీరోకి ఇంత తక్కువ రావడం ఓటీటి హిస్టరీలోనే మొదటిసారి అని చెప్పవచ్చు.

ఈ సిరీస్ విడుదలై రెండు రోజులు అవుతున్నా.. ఇంకా వెంకీ మామపై ట్రోల్స్ ఆగడం లేదు. సిరీస్ లో రానా కూడా ఉన్నా.. నెటిజన్లు, ట్రోలర్స్ వెంకీ మామపైనే విరుచుకుపడతున్నారు. ఇది ఇప్పట్లో తగ్గేలా లేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు