Krish : మరో అద్భుత స్టోరీతో

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘గమ్యం’ సినిమాతో దర్శకునిగా  తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తరువాత వేదం సినిమాతో అందరి మన్ననలు పొందారు. సినిమా ఫలితం ఏవిధంగా ఉన్నప్పటికీ దర్శకుడు క్రిష్ మంచి గుర్తింపు సంపాదించాడనే చెప్పవచ్చు. ఇక ఆ తరువాత వరుస సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన గౌతమిపుత్రా శాతకర్ణి సంచలన విజయం సాధించింది.  

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు క్రిష్. మరోవైపు తెలుగులో ఇప్పుడే నిలదొక్కుకుంటున్న సోనీ లీవ్ ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేశాడు. గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారంగా  ఈ వెబ్ సిరీస్ రానున్నది. ముఖ్యంగా పూర్వ కాలంలో బాల్యవివాహాలు, వితంతు వివాహాలతో పాటు మూడాఛారాలు, అప్పటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాయనేది ఈ నాటకం అద్భుతంగా చెబుతుంది. అదేవిధంగా అప్పటి ఆచారాలతో స్త్రీ స్వేచ్ఛనీ అణిచివేసే ప్రయత్నాలు బలంగా జరిగిన తీరు కనిపిస్తుంది. ఆ నాటకాన్ని నేటి సమస్యలతో ముడిపెట్టి మోడ్రన్ గా చేసినట్టు తెలుస్తోంది. 

ఇక ఈ నాటకంలో గిరీశం, మధురవాణి, బుచ్చమ్మ, రామప్ప పంతులు, లుబ్దావధానులు, కరటక శాస్త్రి, సుబ్బి వంటి పాత్రలు చాలా కీలకమైనవి. ఈ నాటకాన్ని స్వయంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇక ఈ నాటకంలో గిరీశంగా అవసరాల శ్రీనివాస్, రామప్ప పంతులుగా సాయికుమార్ నటించనున్నట్టు సమాచారం. మరోవైపు అనసూయ కూడా ఇందులో నటించనుందట. పవన్ సినిమా పూర్తి చేసిన తరువాత క్రిష్ ఈ నాటకాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. అప్పటి పరిస్థితులను క్రిష్ ఏవిధంగా చూపిస్తాడో వేచి చూడాలి మరి. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు