Unstoppable : అంచనాలకు మించి

తెలుగులో మొట్ట మొదటి OTT ప్లాట్ ఫామ్ గా వచ్చిన ఆహా ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. అల్లు అరవింద్ స్థాపించిన ఆహా కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ టాప్ OTT ఛానల్ గా నిలిచింది. సినిమాలతో పాటు కుకింగ్ షోస్, టాక్ షోస్,ఇండియన్ ఐడల్ తెలుగు ఇలా వివిధ రకాల షోస్ తో దూసుకుపోతుంది.

అంతే కాదు సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో సామ్ జామ్ అనే షోతో హోస్ట్ గా పరిచయం చేసారు. వీటి తో పాటు గాడ్ అఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న నందమూరి బాల కృష్ణ షో హోస్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. “అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె” తో సెకండ్ సీజన్ ను కూడా మొదలు పెట్టిన ఆహా స్టార్ హీరోల ఇంటర్వ్యూ లతో అన్ స్టాపబుల్ గా నిలుస్తుంది.

నందమూరి బాలకృష్ణ హీరోగానే యాంకర్ గా చాలా మంచి పేరును తెచ్చుకున్నారు. ”అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె” టాక్ షోతో దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆహా కు పేరు తీసుకొచ్చిన షో కూడా ఇదే అని చెప్పొచ్చు. బాలయ్యకు కొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టింది ఈ టాక్ షో.
కుర్ర హీరోలతో జత కట్టి బాల కృష్ణ చేసే కామెడీ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుంది. మహేష్ బాబు, ప్రభాస్, అడవి శేష్, శర్వానంద్, విశ్వేక్ సేన్, నాని, లాంటి కుర్ర హీరోలను ఇంటర్వ్యూ చేస్తూ మంచి రేటింగ్ కు సాధించుకుంది ఆహా. అన్ స్టాపబుల్ “బాప్ అఫ్ అల్ షోస్” గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ షోకు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ ప్రోమోతో స్టార్ట్ అయే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది ఆహా.

- Advertisement -

చరిత్ర మారబోతుంది. రికార్డులు బద్దలవ్వబోతున్నాయి. అగ్నికి ఆయువు తోడైనట్టు, పవర్ స్టార్ కి లెజెండరీ ఫైర్ యాడ్ అవ్వబోతుంది. మరో సారి ఆహా యాప్ క్రాష్ అవబోతుంది.
ఎప్పుడు జరిగే దాని అనుభవం అంటారు.
ఎప్పుడో జరిగే దానిని అద్భుతం అంటారు.
ఫిబ్రవరి 3న మనం అలాంటి అద్భుతమే చూడబోతున్నాము.
Episode will stream from February 3rd on Aha App

For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు