Unstoppable 2: ఇప్పుడు స్నేహితులని చూడండి

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు బాలకృష్ణ. తనదైన మాటలతో, పంచులతో వచ్చిన గెస్ట్ లను తికమక పెడుతూ ఎంతో సరదాగా సాగుతుంది అన్ స్టాపబుల్ సీజన్ 2. ఇక ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ హాజరైన విషయం తెలిసిందే.

ఈ సీజన్ లో ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. ఈ మూడు ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేశాయి. నాలుగవ ఎపిసోడ్ ప్రోమో ని గురువారం విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 25వ తేదీన ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కి నటి రాధిక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ప్రత్యేక గెస్ట్ లుగా విచ్చేశారు.

“ఇప్పటివరకు బాలయ్య ఫ్యాన్స్ ని, అలాగే కుటుంబాన్ని చూశారు. ఇప్పుడు స్నేహితులని చూడండి” అంటూ ఈ ప్రోమో ని రిలీజ్ చేశారు. ఇక వీరు ముగ్గురు బాలయ్య కి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పలు ఆసక్తికర ప్రశ్నలతో, సంభాషణలతో సాగిన ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ పై ఆడియన్స్ లో మంచి హైప్ ని ఏర్పరిచింది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు