OTT: ఊహించని ట్విస్ట్ తో వచ్చేసిన వారసుడు

తమిళ దళపతి విజయ్ ఈ ఏడాది వారసుడు వంటి బిగ్ హిట్ తో ప్రారంభించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. వారసుడు.. విజయ్ దళపతి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ లో రూ. 300 కోట్ల మార్క్ అందుకున్న రెండో సినిమాగా వారసుడు నిలిచింది. కాగా రష్మిక మందన్న.. ఇది వరకే అల్లు అర్జున్ తో నటించిన పుష్ప సినిమాతో రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ఇదిలా ఉండగా, తాజాగా విజయ్ దళపతి వారసుడు సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనే ఓటీటీలకి తీసుకువస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ, తాజాగా పై మూడు భాషలతో పాటు కన్నడలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నేరుగా తెలుగులో నటించిన తొలి చిత్రం ఇది. దీనికి ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్.. బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ మూవీని తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం అనేక రికార్డులను క్రియేట్ చేసింది.

- Advertisement -

కాగా థియేట్రికల్ రన్ ను ముగించుకున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్ లో మిస్ అయిన వారు ఇక అమెజాన్ లో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు