Vikram : డేట్ ఫిక్స్

చియాన్ విక్రమ్ హీరోగా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి హీరోయిన్ గా నటించిన చిత్ర కోబ్రా.  ఈ చిత్రం ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. వైవిద్యమైన స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్యంగా విక్రమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. వివిధ గెటప్ లలో నూటికి నూరు శాతం మార్కులు కొట్టేశాడు. లెక్కల మాస్టారుగా ఉన్న మది క్రైమ్స్ ఎందుకు చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.  ఇందులో ఇంటర్ పోల్ అధికారి పాత్రలో మాజీ క్రికేటర్ ఇర్పాన్ పఠాన్ నటించిన విషయం విధితమే. ఈ చిత్రానికి అజయ్  జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 

ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారికి శుభవార్త చెప్పింది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. క్రోబ్రా సెప్టెంబర్ 28 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ విషయాన్ని స్వయంగా సోని లీవ్ ట్టిట్టర్ వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా కొత్త ట్రైలర్ కూడా విడుదల చేసింది. 

ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే మరో తిరకాస్తు ఉంది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పటికీ ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. సోని లివ్ యాప్ లో మాత్రం ఈ చిత్రం తమిళ వెర్షన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించడం గమనార్హం. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు