vishwak sen: ఓటీటీ రిలీజ్ కు రెడీ

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో విశ్వక్ సేన్. రెండో సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో యూత్ కు కనెక్ట్ అయ్యాడు. దీని తర్వాత వరుస సినిమాలతో మంచి హిట్స్ ను అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం విశ్వక్ సేన్ “ధమ్కీ” సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ కు రెడీ అవుతున్నాడు. విశ్వక్ కు జోడిగా నివేత పేరురాజ్ నటించారు.
తాజా సమాచారం ప్రకారం విశ్వక్ సేన్ పాన్ ఇండియా సినిమా “ధమ్కీ” ఫిబ్రవరి 17న రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు చెప్పుకొస్తున్నాయి సినీ వర్గాలు.

ఇది ఇలా ఉండగా విశ్వక్ గెస్ట్ రోల్ లో కనిపించిన సినిమా OTT రిలీజ్ కు రెడీ అవుతుంది. గంగాధర్ దర్శకత్వం వహించిన సినిమా “ముఖచిత్రం“. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అతిధి పాత్రలో కనిపించాడు. మంచి హుషారు అయిన లాయర్ పాత్రలో నటించి మెప్పించాడు విశ్వక్. వికాస్ వశిష్ఠతో పాటు “హుషారు” సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన ప్రియా వడ్లమాని హీరోయిన్ గా నటించారు. వీరితో పాటు అయేషా ఖాన్ మరియు యు ట్యూబ్ హీరో చైతన్య రావు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా ఇప్పుడు OTT రిలీజ్ కు రెడీ అవుతుంది. ఫిబ్రవరి 3 నుంచి ఆహా లో ఈ సినిమా స్ట్రీమ్ కానున్నట్టు ప్రకటించారు మేకర్స్.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు