Yashoda : ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముఖ్య పాత్రలో వచ్చిన తాజా చిత్రం యశోద. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీ దేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ వల్ల భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ అంచనాల నడుమ శుక్ర వారం యశోద పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న యశోద, అన్ని సెంటర్ లలో కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తుంది. 3 కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైన ఈ చిత్రం 40 కోట్ల బడ్జెట్ వరకు ఎందుకు వెళ్లిందో సినిమా చూస్తే అర్థమవుతుందని ప్రేక్షకులు అంటున్నారు. అలాగే సమంత కూడా మంచి నటనతో ఆకట్టుకుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమంత కెరీర్ లో ఒక బిగ్ హిట్ పడటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, యశోద సినిమా ఎప్పుడు ఓటిటిలోకి వస్తుంది. ఏ ఓటిటి ప్లాట్ ఫాంలో అందుబాటులోకి రానుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. యశోద స్ట్రిమింగ్ పార్ట్ నర్ గా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోను ఖరారు చేసిన్నట్టు వెల్లడించారు. అయితే ఈ చిత్రం ఎప్పుటి నుంచి స్ట్రీమింగ్ చేస్తారో అనేది మాత్రం క్లారిటి రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు