RRR : ముందు మెలికపెట్టింది.. నేడు తలొగ్గింది

ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు చిత్ర సీమలో ఓ విప్లవం.
ఎంతో మంది డైరెక్టర్లకు, హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఈ మూవీని, పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే. జక్కన్న చెక్కిన ఈ మూవీ ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు సినీ ప్రపంచమే ఫీదా అయిపోయింది. బాలీవుడ్ తో సహా అన్ని ఇండస్ట్రీలు టాలీవుడ్ వైపు తిప్పేలా చేసింది. ఈ క్రెడిట్ మొత్తం రాజమౌళికే దక్కుతుందని చెప్పవచ్చు.

మార్చి 25న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైన ఈ మూవీ, ఇటీవలే సక్సస్ ఫుల్ గా 50 రోజులను కంప్లీట్ చేసుకుంది. అలాగే 1,150 కోట్లు వసూళ్లు చేసి, దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన నాలుగో సినిమాగా నిలిచింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇటివలే ఫిక్స్ చేసుకుంది. జీ5 ప్లాట్ ఫాంలో ఈ నెల 20 నుండి స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటన చేసింది.

అయితే ఈ మూవీ చూడాలంటే, జీ5 సబ్ స్క్రైబర్లు కూడా అదనంగా 100 రూపాయలు చెల్లించాలని మెలిక పెట్టింది జీ5. దీన్ని కొద్ది రోజల నుండి నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. థియేటర్స్ లో టికెట్ల రేట్లను భారీగా పెంచుకుని, లాభాలు తెచ్చుకుని, మళ్లీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ను కూడా క్యాష్ చేసుకుంటారా.. అంటూ ఆర్ఆర్ఆర్, జీ5 పై సినీ లవర్స్ ఫైర్ అయ్యారు.

- Advertisement -

ఫ్యాన్స్ వ్యతిరేకతను గ్రహించిన జీ5, ఎట్టకేలకు ప్రేక్షకుల డిమాండ్ కు తలొగ్గింది. అదనంగా 100 రూపాయలు చెల్లించాలనే నిబంధనను జీ5 ఎత్తివేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ రేపటి నుండి జీ5 సబ్ స్క్రైబర్లకు ఉచితంగానే అందుబాటులోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు