Nani : “అంటే.. అరుదైన సినిమా”

నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జంటగా వచ్చిన సినిమా అంటే సుందరానికీ.బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో లాంటి విభిన్న సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కాగ ఈ సినిమా 10వ తేదీన తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అయిన విషయం తెలిసిందే. తొలి రోజు నుండే నాని సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే, కలెక్షన్లు మాత్రం కాస్త తక్కువగానే వచ్చాయి. కానీ వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టడంతో కాస్త ప్లస్ అయింది.

దీంతో అంటే సుందరానికీ చిత్ర బృందం ఈ రోజు సక్సస్ మీట్ ను జరుపుకుంది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ “ ‘అంటే సుందరానికీ’ విజయం టీం సమిష్టి కృషి. ‘అంటే సుందరానికీ’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్ కేవలం బాక్సాఫీసు నెంబర్లే కాదు, ఈ రోజు ప్రేక్షకుల హృదయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్లాక్ బస్టర్ అనేది సమయం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో ‘అంటే సుందరానికీ’ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. దాన్ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం.

మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అంటే సుందరానికీ కూడా అలా అరుదైన సినిమానే. ‘అంటే సుందరానికీ’ వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కడుపు నిండిపోయింది. నా కెరీర్ టాప్ ఆర్డర్ లో వుండే సినిమా ‘అంటే సుందరానికీ’. ఇది అవకాయ్ లాంటి సినిమా. మూడు రోజులు రుచి చూసారంటే రోజురోజుకి ఊరుతుంది. రుచి ఇంకా పెరుగుతుంది. రెండేళ్ళ తర్వాత కూడా మంచి తెలుగు సినిమా పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే చెప్పే రెండు, మూడు పేర్లలో అంటే సుందరానికీ వుంటుంది” అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు