ఇంత రెస్పాన్స్ ఊహించ‌లేదు : హీరో గగన్ విహారి

మహా ప్రస్థానం, అత్తారింటికి దారేది, క్షణం, నిన్ను కోరి,శైలజారెడ్డి అల్లుడు, కృష్ణార్జున యుద్ధం,118, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలలో విలన్ గా, సోదరుడుగా, స్నేహితుడుగా నటించి ప్రేక్షకులలోను, పరిశ్రమలోను నటుడుగా మంచిపేరు తెచ్చుకున్న నటుడు గగన్ విహారి. తాజాగా “1996 ధర్మపురి”చిత్రంతో.హీరోగా పరిచయ మయ్యాడు.శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన చిత్రం”1996 ధర్మపురి”. .ఓషో వెంకట్ సంగీతం ఆందించిన‌ ఈ చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 22 న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతూ ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర హీరో గగన్ విహారి మీడియాతో మాట్లాడుతూ…

నాకు యాక్టింగ్ అనేది చిన్నప్పటి కల.ఇంజినీరింగ్ లో ఐటి పూర్తి చేసిన తరువాత బిసినెస్ స్కూల్ లో యం.బి.ఎ చేసి ఇండస్ట్రీకి రావడం జరిగింది. 2010 లో దర్శకుడు జీవి గారు “రంగ ది దొంగ” సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత శర్వానంద్ కు ఫ్రెండ్ గా నటించిన “మహా ప్రస్థానం” సినిమాకు ప్రేక్షకులనుండి మంచి అప్లాజ్ వచ్చింది..ఆ తరువాత ది గ్రేట్ లెజెండ్ దర్శకుడు త్రివిక్రమ్ గారు “అత్తారింటికి దారేది” సినిమాలో అవకాశం ఇవ్వడంతో నాకు పరిశ్రమ నుండి ప్రేక్షకుల నుండి చాలా మంచి పేరు వచ్చింది.ఆ సినిమాతో నాకు స్క్రీన్ స్పెస్ పెరగడంతో రాజా ది గ్రేట్ విలన్ తమ్ముడిగా, కృష్ణార్జున యుద్ధం లో విలన్ గా, నిన్ను కోరి, 118 ,చాణిక్య,శైలాజా రెడ్డి అల్లుడు, గాలి సంపంత్, సోగ్గాడే చిన్ని నాయనా, వంటి మొదలగు సినిమాలలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలందరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నేను అడ్వాంటేజ్ అవ్వాలి తప్ప డిజడ్వాంటేజ్ కాకూడదని కష్టపడి పనిచేసే వాన్ని.అలాగే నటుడుగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి పాత్ర చెయ్యకుండా డీఫ్రెంట్ పాత్రలను సెలెక్ట్ చేసుకొని నటించడం జరిగింది.

జగత్ గారు నాకు మంచి ఫ్రెండ్ తను నాకు “1996 ధర్మపురి”. కథ చెప్పినప్పుడు అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాడేమో అనుకున్నాను.;ఆ తరువాత ఇందులో నువ్వే హీరో అంటే నేను షాక్ అయ్యి తను చెప్పిన మాటలకు మొదట నమ్మలేదు. మంచి కథ నీకైతే ఈ సినిమా బాగుంటుంది అని ఈ సినిమా కథ చెప్పాడు.తను చెప్పిన కథ నాకు ఎంతో నచ్చింది.1996 ప్రాంతంలో ధర్మపురి లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో నేను హీరోగా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేసి నాలోని ట్యాలెంట్ ను బయటకు తీసిన దర్శక, నిర్మాతలకు నేనెప్పుడూ ఋణపడి ఉంటాను.

- Advertisement -

నేను చేసిన భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో నేను చేసిన “1996 ధర్మపురి” సినిమా రిలీజ్ ముందు పెద్ద సినిమాల మధ్య మేము వస్తున్నందుకు రోజు చాలా టెన్షన్ పడ్డాను.ఆ తరువాత సినిమా చూసిన ఆడియన్స్ అందరూ ధర్మపురికి వెళ్లివచ్చినట్లుంది.ఇందులో సూరి,వల్లి క్యారెక్టర్స్ కు కనెక్ట్ అయ్యాము అని చెప్పడం జరిగింది. ఈ సినిమా ను విడుదల చేసిన ప్రతి చోటా పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని పెద్ద సినిమాల మధ్య వచ్చిన మా సినిమాను ఆదరించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

“1996 ధర్మపురి”సినిమాలో చాలా చక్కగా నటించావని ఇండస్ట్రీ నుండి చాలామంది ఫోన్స్ చేసి అభినందనలు తెలుపు తున్నారు .మైత్రి మూవీ మేకర్ రవి గారు,రాం గారితో పాటు చాలా మంది పర్సనల్ సినిమా చూసి ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో సాంగ్స్, డైలాగ్స్ బాగున్నాయి. ప్రేక్షకులకు మంచి సినిమా చూపించారని చెప్పడం జరిగింది.

సక్సెస్ టూర్ లో భాగంగా మేము విజయవాడ కు వెళ్తే అక్కడ ఆడియన్స్ అందరూ మాకు గ్రాండ్ వెల్ కం పలికారు. ఈ సినిమా రియలిస్టిక్ గా అద్భుతంగా తీశారని ఆడియన్స్ అందరూ ఎంతో ఎమోషన్ అవ్వడమే కాక ఈ సినిమాలోని “నల్లరేని కళ్ళ దానా” పాటకు మమ్మల్ని స్టేజ్ మీదకు తీసుకెళ్లి మాతో డ్యాన్స్ చేయించారు.ఆ తర్వాత ఏలూరు లో కూడా అంతే రెస్పాన్స్ ఇచ్చారు.ఆడియన్స్ నుండి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు.నా రాబోయే సినిమాలకు మరింత కష్టపడి మంచి స్క్రిప్ట్ తో ప్రేక్షకులముందుకు వస్తాను. “1996 ధర్మపురి” వంటి సినిమాను ఒన్ చేసుకొని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు

గత 3 సంవత్సరాలనుంది ఈ సినిమాకు టీం అంతా చాలా కష్టపడ్డాము ప్రస్తుతం 1996 ధర్మపురి” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాను.అలాగే కొన్ని కథలు విన్నాను ఇంకా ఫైనల్ చెయ్యలేదు త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాను అని ముగించారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు