Charlie 777 : కుక్కకు మనిషికు ఉన్న భావోద్వేగమే చార్లీ 777

శాండిల్ వుడ్ హీరో రక్షిత్ శెట్టికి తెలుగు తెరకు పరిచయమే. “అతడే శ్రీమన్నారాయణ” ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రక్షిత్ శెట్టి. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రక్షిత్ శెట్టి తాజా గా “చార్లీ 777” ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కన్నడ డైరెక్టర్ కిరణ్ రాజ్ కే దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషలల్లో తెరకెక్కుతుంది. 

కన్నడలో ఈ సినిమాను హీరో రక్షిత్ శెట్టియే నిర్మిస్తుండగా, తెలుగులో  సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రానా దగ్గుబాటి స‌మ‌ర్పణ‌లో ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై జి.ఎస్‌.గుప్తా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. చిత్ర బృందం ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇటీవల హైదరాబాద్ లో చార్లీ 777 బృందం ప్రెస్ మీట్ నిర్వహించి సందడి చేసింది. కాగా, ఒక కుక్క కు ఓ మనిషికి మధ్య ఉన్న భావోద్వేగాన్ని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు కిరణ్ రాజ్ కే. 

విడుదల తేదీ : విభిన్న కథతో వస్తున్న చార్లీ 777 ఈ నెల 10న విడుదల కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు