Ante Sundaraniki : జూన్ 10న నాని అంటే సుందరానికి

“శ్యామ్ సింగరాయ్” హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం “అంటే సుందరానికి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను “మెంటల్ మదిలో” “బ్రోచేవారెవరురా” సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలల్లో తెరకెక్కుతుంది. నానికి జోడీ నజ్రియా నజీమ్ నటించగా, కీలక పాత్రలో సుహాస్, హర్షవర్ధన్, నదియా, రాహుల్‌ రామకృష్ణ కనిపించబోతున్నారు.

కాగ ఈ సినిమా నుండి ఇప్పటికే పంచెకట్టు, ఎంత చిత్రం, రంగో రంగ పాటలతో పాటు ట్రైలర్ కూడా రిలీజైంది. ఇవి ఈ సినిమాపై అంచనాలు కాస్త భారీగానే పెంచాయి. కాగా, ఈ మూవీ జూన్ 10వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నిడివి గురించి ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా ఉంది. ఈ సినిమా కనీసం మూడు గంటల పాటు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. కథ మరీ ఇంట్రెస్ట్ గా ఉంటేనే, సినిమా పెద్దగా ఉన్నా, చూడటానికి ఆసక్తి చూపుతారు ప్రేక్షకులు. ఓ రొమాంటిక్ కామెడీ సినిమాకు ఇంత రన్ పెట్టడం నిజంగా సహసమే అని చెప్పొచ్చు.

విడుదల తేదీ : భారీ అంచనాలతో జూన్ 10వ తేదీన రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు