నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా హంగామా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి థియేటర్లలో హంగామా మొదలైంది. థియేటర్ల వద్ద అభిమానులు కోలాహాలం మామూలుగా లేదు. భాగ్యనగరం లో పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు […]