Atlee Priya : తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్

గత కొన్ని నెలలుగా సౌత్ ఇండస్ట్రీ లో గుడ్ న్యూస్ లు చెప్తున్నారు దర్శకులు మరియు హీరోలు. పెళ్లి అయిన 10 సంవత్సరాలకు ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు చిరంజీవి. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ నేను తండ్రి కాబోతున్నానంటూ ఆనందం వ్యక్తం చేసాడు.

తమిళ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను అతి తక్కువ సినిమాలతోనే తెచ్చుకున్నాడు అట్లీ. 2019లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రం బిగిల్‌ తో మంచి పేరును సాధించాడు.అట్లీ ఇప్పుడు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

2014లో అట్లీ తాను ప్రేమించిన నటి కృష్ణ ప్రియను పెళ్లాడాడు. వారు కలిసి “A ఫర్ ఆపిల్ ప్రొడక్షన్” అనే ప్రొడక్షన్ హౌస్‌ నుప్రారంభించారు. ఆ బ్యానర్‌లో రెండు చిత్రాలను నిర్మించి మంచి హిట్స్ అందుకున్నారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత , అట్లీ & ప్రియా వారి జీవితాల్లో కొత్త అనుభూతిని పొందబోతున్నారు. అట్లీ మరియు ప్రియ తాము తల్లీ తండ్రులము కాబోతున్నట్టు ప్రకటించారు.

- Advertisement -

“సంవత్సరాలుగా మీరు మాపై కురిపించిన ప్రేమ మరియు మద్దతుకు మేము కృతజ్ఞులమై ఉన్నాము, మీరు మా చిన్నారికి కూడా మీ ప్రేమను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. మీ అందరి దీవెనలతో ఈ ప్రపంచంలోకి మా చిన్న ఆనందాన్ని తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము ” అంటున్నారు ఈ కపుల్.

 

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు