Bichagadu2: తమిళ్ కంటే ముందు తెలుగులోనే టార్గెట్ ఔట్

ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన తాజా చిత్రం బిచ్చగాడు2. ఇంతకు ముందు విజయ్ నటించిన బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. మే 18 న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నా మంచి వసూళ్లను సాధిస్తుంది. అటు, తమిళ్ తో పాటు తెలుగులోనూ చిత్ర యూనిట్ సినిమాను బాగా ప్రమోట్ చేయడంతో సినిమా తమిళ్ కంటే ఎక్కువ ఓపెనింగ్స్ ని తెలుగులో రాబట్టింది.

ఇక బిచ్చగాడు2 విడుదలైన నాలుగురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోగా ఐదవ రోజుతో లాభాల బాట పట్టింది. అయితే ఇది కేవలం తెలుగులోనే. ఒక తమిళ్ సినిమా అక్కడి కంటే ముందు తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వడం విశేషమనే చెప్పాలి. ఇక బిచ్చగాడు విడుదలైన 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6.93 కోట్ల షేర్ ని, 12.20 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

ఇక 5 రోజుల్లో బిచ్చగాడు2 వరల్డ్ వైడ్ లెక్క చూస్తే ఏపీ,నైజాం 12.20 కోట్లు, తమిళనాడు 11.05 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1కోటి , ఓవర్సీస్ లో 1.02 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 16 కోట్ల టార్గెట్ కి గాను “బిచ్చగాడు2” 12.42 కోట్ల షేర్ ని 25.25 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అంటే ఈ సినిమా మొత్తంగా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3.58 కోట్లు కావాలి.

- Advertisement -

ఇక ఈ వారం పెద్ద సినిమాలు ఏవి విడుదల కావడం లేదు. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కూడా చాలా తక్కువ మొత్తంలో కావాలి. అందువల్ల రెండో వారంలోకి ఎంటర్ అయ్యే సరికి బిచ్చగాడు2 క్లీన్ హిట్ గా నిలవడం ఖాయమనే చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు