Vijay antony: బిచ్చగాడు2 సెన్సేషన్. బీ,సీ సెంటర్స్ పవర్

తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నటించిన “బిచ్చగాడు” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2016 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అమ్మకోసం బిచ్చగాడిగా మారిన హీరో కథ ఇది. సెంటిమెంట్ కథాంశం తో వచ్చిన ఈ సినిమా సెన్సషనల్ హిట్ అవగా, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మూవీ బిచ్చగాడు2. మొదటి భాగం అమ్మ కాన్సెప్ట్ తో తీయగా రెండో భాగం ను చెల్లెలి కాన్సెప్ట్ తో తీశారు.

విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన బిచ్చగాడు2 సినిమా మే 19 న తెలుగు, తమిళ భాషల్లో విడుదలయింది. తమిళ్,తెలుగులో రెండిట్లోనూ భారీగా ప్రమోట్ చేయగా బిచ్చగాడు2 ఆడియన్స్ నుంచి మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే మొదటి పార్ట్ ఇంపాక్ట్ వల్లో లేదా ఈ ఈ సినిమా బాగుండడం వల్లో ఫస్ట్ డే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు బిచ్చగాడు2 తెలుగు రాష్టాల్లో 2.32 కోట్ల రూపాయల షేర్ ని 4.10 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే తమిళ్ లో ఫస్ట్ డే 3 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిన బిచ్చగాడు2 తెలుగు లో మాత్రం దాని కంటే ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సింగల్ స్క్రీన్ లు, బీ,సీ సెంటర్లలో హౌస్ ఫుల్స్ అవడం విశేషం.

ఇక బిచ్చగాడు2 ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ భాషల్లో కలిపి 4 కోట్ల షేర్, అలాగే 8.15 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 15 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా 16 కోట్ల టార్గెట్ కి గాను బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 12 కోట్లు వసూలు చేయాలి. మరి వీకెండ్ ముగిసేసరికి బిచ్చగాడు 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు