Dhanush : “తిరు”గులేని రికార్డ్

దక్షిణాది స్టార్ హీరో ధనుష్ కు కోలీవుడ్ తో పాటు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. “3”, “రఘువరన్ బీటెక్” సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ధనుష్.. ఆ తర్వాత మారి అసురన్, కర్ణన్ సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల ధనుష్ నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం తిరుచిట్రంపళం. ఈ సినిమా తెలుగులో “తిరు” గా విడుదలైంది. నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే దిగ్గజ దర్శకుడు భారతీ రాజా, ప్రకాష్ రాజ్, నటి రేవతి తదితరులు కీలకపాత్రలలో కనిపించారు.

ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిగా, మిత్రన్ ఆర్ జవహర్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. ఆగస్టు 18న విడుదలైన ఈ చిత్రం, డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో ధనుష్ తాజాగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. ధనుష్ కు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

అంతేకాకుండా ఈ ఏడాది తమిళంలో అత్యధిక లాభాలు సాధించిన చిత్రంగా తిరుచిట్రపళం (తిరు) నిలిచింది. ఇదిలా ఉండగా ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లైక్స్ తో పాటు సన్ నెక్స్ట్ కూడా దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17 నుంచి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు