FIFA World Cup :ఫీఫా వరల్డ్ కప్ లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీస్

ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఫుట్ బాల్ కు ఉంటారని అందరికీ తెలిసిందే. ఫుట్ బాల్ లో ఎంతో ప్రతీష్టాత్మకమైన కప్ ఫీపా వరల్డ్ కప్. ఈ కప్ ఫైనల్ అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య హోరా హోరి గా జరిగింది. దీనిలో అర్జెంటీన విజయం సాధించింది. ఇది ఇలా ఉండగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫీఫా వరల్డ్ కప్ లో బాలీవుడ్ హీరోయిన్స్ సందడి చేశారు. బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొణెతో పాటు మరో బ్యూటీ నోరా ఫతేహి కనిపించారు. క్లోసింగ్ ఈవెంట్ లో తన డాన్స్ తో ఫ్యాన్స్ అలరించారు.

ఫైనల్ మ్యాచ్ కు ముందు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఫిఫా వరల్డ్ కప్ ను ఆవిష్కరించింది. స్పానిష్ ఫుట్ బాలర్ ఇకర్ కాసిల్లాస్ తో దీపికా పదుకొణ్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఇకర్ కాసిల్లాస్, దీపికా పదుకొణ్ కలిసి ట్రోఫీని గ్రౌండ్ లోకి తీసుకువచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేదికపై ఇండియా నుంచి దీపికా పదుకొణె ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరో స్టార్ హీరోయిన్ నోరా ఫతేహి కూడా మెరిసింది. ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లో నోరా ఫతేహి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంతర్జాతీయ స్టార్స్ డేవిడో, ఓజునా, ఐషా, గిమ్స్, రహ్మా రియాద్, బాల్కీస్ తో నోరా ఫతేహి కనిపించింది. ఇలా ప్రపంచ వేదికలపై బాలీవుడ్ హీరోయిన్స్ భాగం కావడం భారత్ కు ఎంతో గర్వ కారణం అంటూ అభిమానులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు