Kantara : కేజీఎఫ్2ను దాటేసింది

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, సెన్షేనల్ హిట్ అయ్యే సినిమాలు చాలా ఉన్నాయి. ఈ లిస్ట్ లో కన్నడలో విడుదలైన కాంతార కూడా ఒకటి. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ముందుగా ఈ సినిమా కేవలం కన్నడలోనే రిలీజ్ చేశారు. కానీ అక్కడ వస్తున్న స్పందనను చూసి పాన్ ఇండియా స్థాయికి విస్తరించారు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో పెద్ద విజయాన్ని దక్కించుకుంది.

ఈ సినిమా ఇప్పటికే 50 రోజులను పూర్తి చేసుకుంది. అయినా థియేటర్ లో ఈ సినిమా కలెక్షన్ల జోరు ఇంకా తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమా ఒక అసక్తిరమైన ఫీట్ ను అందుకుంది. కన్నడలో కేజీఎఫ్2ను అధిగమించింది. అక్కడ నేటికి 160.50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో చూస్తే కాంతార కలెక్షన్లు 400 కోట్ల మార్కును అందుకుంది.

కాంతార ను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ఏకంగా 60 కోట్లను కొల్లగొట్టింది. అలాగే తమిళనాడులో 12.70 కోట్లు, ఓవర్సీస్ లో 44.50 కోట్లు, కేరళలో 19.20 కోట్ల, హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో 96 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. 16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కాంతార సినిమా ఎవరూ ఊహించని విధంగా 400 కోట్లు కొల్లగొట్టడంతో సినీ విశ్లేషకులు సైతం అశ్చర్యపోతున్నారు. ఇదిఇలా ఉండగా కాంతార ఓటీటీలోనూ రికార్డులను నెలకొల్పుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు