Salaar: ప్రభాస్ కు ఓవర్సీస్‌లో హై డిమాండ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇందులో భారీ యాక్షన్ థ్రిల్లర్ అయిన సలార్ ఒకటి. శృతిహాసన్ కథానాయిక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వహిస్తున్నాడు. KGF, కాంతార వంటి కన్నడ బ్లాక్ బస్టర్స్ ని నిర్మించిన హోంబాలే సినిమాలు వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రకటించినప్పటికి, పాన్ వరల్డ్ గా తెరకెక్కించే ఆలోచనల్లో ఉన్నారని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా సెప్టెంబర్28న భారీ స్థాయిలో పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, సాలార్ సినిమా ఓవర్ సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాట. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ ఎల్ ఎల్ సి వారు సలార్ ఓవర్సీస్ హక్కులను కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్నారు. డార్లింగ్ యాక్షన్ సినిమాకి అన్ని ప్రాంతాలలో డిమాండ్ భారీ స్థాయిలో ఉంది.

ఓవర్సీస్ లో ఈ పాన్ ఇండియా స్టార్ సినిమాలకు మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కేజీఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు కూడా ఓవర్సీస్ లో మంచి ఇమేజ్ వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడంతో అన్ని ప్రాంతాల్లో అంచనాలు హైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సలార్ ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు