NTR: సింహాద్రి రీ రిలీజ్ ఫస్ట్ డే భీభత్సం.. కానీ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ గురించి, ఆ చిత్ర రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003 లో వచ్చిన ఆ సినిమా టాలీవుడ్ లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఆ రోజులలోనే 28కోట్ల కి పైగా షేర్ సాధించి ఇంద్ర తర్వాత స్థానంలో నిలవడమే కాకుండా, 52 కేంద్రలో సెంటర్ల లో 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా మే 20న సింహాద్రి రీ రిలీజ్ అయింది.

సింహాద్రి విడుదలైనప్పుడు అప్పట్లో అభిమానులు ఎలాంటి హంగామా చేసారో ఇప్పుడు కూడా అదే రేంజ్ లో సందడి చేసారు. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతాల్లో భారీ కటౌట్లు పెట్టి హడావిడి చేసారు. ఇక సింహాద్రి మొదటి రోజు ఎలాంటి రికార్డులు నమోదు చేయాలనీ నందమూరి అభిమానులు ఆశించారో, అంతకు మించి ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి. సింహాద్రి సినిమా ను రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక థియేటర్లలో దాదాపు 1100 స్క్రీన్ లలో విడుదల చేసారు. అందువల్ల ఇండియాలోనే కాక ఈ సినిమాకు ఓవర్సీస్ లోను భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

ఒక్కసారి సింహాద్రి రీ రిలీజ్ ఫస్ట్ డే ఏరియా వైస్ కలెక్షన్లను గమనిస్తే..

- Advertisement -

నైజాం 1.06CR, సీడెడ్ 76L, ఉత్తరాంధ్ర 27L, ఈస్ట్ 16L, వెస్ట్ 14L, గుంటూరు 19L, కృష్ణా 20L, నెల్లూరు 12L, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 2. 90 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక 20L, తమిళనాడు 10L, రెస్ట్ అఫ్ ఇండియా 12L, ఓవర్సీస్ 46L, జపాన్ 8L రెస్ట్ అఫ్ వరల్డ్ 15L టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 4.01 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

ఇక సింహాద్రి సినిమా పలు చోట్ల సీడెడ్ లో ఆల్ టైమ్ రీ రిలీజ్ రికార్డు క్రియేట్ చేసింది.45 లక్షలతో ఉన్న ఖుషి రికార్డును భారీ మార్జిన్ తో బ్రేక్ చేసింది. ఇక నైజాం రికార్డును మాత్రం చెరపలేకపోయింది. ఓవరాల్ గా రీ రిలీజ్ మూవీస్ లో ఫస్ట్ డే రెండో స్థానంలో నిలిచింది. రానున్న రోజుల్లో మరెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు