NBK108: ఆ ఇద్దరి మధ్య మళ్లీ పోటీ – ఈ సారి నెగ్గేదెవరో..?

సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లు విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఒక విచిత్రమైన సెంటిమెంట్ నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజ రవితేజ మధ్య కూడా ఉంది. వివరాల్లోకి వెళితే, గతంలో పలుమార్లు బాలయ్య, రవితేజల సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యాయి. 2008లో రవితేజ నటించిన కృష్ణ, బాలయ్య నటించిన ఒక్కమగాడు సినిమా ఒకేసారి రిలీజ్ అవ్వగా కృష్ణ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఒక్కమగాడు ఎంత డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తర్వాత 2009లో బాలకృష్ణ నటించిన మిత్రుడు, రవితేజ నటించిన కిక్ సినిమా వారం గ్యాప్ లో రిలీజ్ అయితే సేమ్ రిజల్ట్ రిపీట్ అయ్యింది.

2011లో కూడా రవితేజ నటించిన మిరపకాయ్, బాలయ్య నటించిన పరమవీరచక్ర ఒకే సమయంలో విడుదలయ్యాయి. మిరపకాయ్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోగా పరమవీరచక్ర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రవితేజ, బాలకృష్ణ సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయితే కచ్చితంగా రవితేజ సినిమా హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా బాలకృష్ణ, రవితేజ సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమాని దసరా సందర్బంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్.

అయితే అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస హిట్స్ తో ఊపు మీదున్న బాలయ్య అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరో పక్క, రవితేజ ఇటీవల రావణాసుర సినిమాతో డిజాస్టర్ అందుకొని, టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టి తీరాలన్న కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అందరూ అనుకుంటున్నట్టు గతంలో వచ్చిన రిజల్ట్ రిపీట్ అయ్యి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేక బాలకృష్ణ వరుస హిట్స్ పరంపర కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు