Box office: ఈ వారం చిత్రాల వీకెండ్ కలెక్షన్స్.. ఒకటి ఔట్

2023లో బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ అంచనాలు లేకుండా విడుదల అవుతున్న చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. బలగం, విరూపాక్ష లాంటి సినిమాలు అలా వచ్చినవే. ఇక తాజాగా ఈ వారం నాలుగు చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా, మరొకటి మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. మరో రెండు ప్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

ఇక వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్రాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతొచ్చయో చూద్దాం.

ముందుగా 2018 విషయానికి వస్తే మలయాళం లో చిన్న సినిమాగా విడుదలై ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోను పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు సాధించింది. రెండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే టార్గెట్ ని రీచ్ అవ్వడం విశేషం. మూడు రోజుల్లో నైజాం లో 1.96కోట్లు, ఏపీ, సీడెడ్ కలిపి 2.37కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. టోటల్ గా 2.02 కోట్ల షేర్ ని, 4.32 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా పూర్తిగా బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలిచి లాభాల బాట పట్టింది.

- Advertisement -

ఇక రీసెంట్ గా భారీ ప్రమోషన్లు చేస్తూ విడుదలైన చిన్న సినిమా “మేం ఫేమస్” కూడా మిక్సడ్ టాక్ తో డీసెంట్ వసూళ్లను సాధించింది. 2.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా తెలుగురాష్ట్రాల్లో మూడు రోజుల్లో నైజాం1.51cr ఏపీ, సీడెడ్ కలిపి 90 lacks వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా మూడురోజుల్లో 1.52 కోట్ల షేర్ ని 3.07 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కి 60 లక్షల దాకా షేర్ ని రాబట్టాలి.

ఇక వీటితో పాటే విడుదలైన చిన్న సినిమాలు మళ్ళి పెళ్లి, మెన్ టూ సినిమాలు మొదటిరోజే బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమయ్యాయి. మళ్ళీ పెళ్లి మూడు రోజుల్లో 20లక్షల షేర్ మాత్రమే వసూలు చేయగా, బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇక మెన్ టూ చిత్రం గురించి అసలు పట్టించుకునే వారే లేరు. ఇప్పటి వరకు అఫిషియల్ కలెక్షన్ల డీటెయిల్స్ బయటికి రాలేదు గాని, ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం 20లక్షల వరకు వసూలు చేసిందని సమాచారం. ఓవరాల్ గా ఈ వారం విడుదలైన సినిమాల్లో “2018” సినిమా క్లీన్ హిట్ గా నిలవగా, మేం ఫేమస్ డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ హిట్ దిశగా దూసుకుపోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు