Bigg Boss 6 : హాట్ యాంకర్ అవుట్ ?

బిగ్ బాస్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. ప్రస్తుతం మూడో వారాన్ని పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ ఇప్పుడు ఆరో సీజన్ వస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్ కంటే పేలవమైన టీఆర్పీతో ఈ సీజన్ నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడం లేదు. బిగ్ బాస్ ఓటీటీ సమయంలో ఐపీఎల్ హవా ఉండటంతో అప్పుడు టీఆర్పీ రేటింగ్ తక్కువగా వచ్చింది. కానీ ఇప్పుడు క్రికెట్ కు సంబంధించి పెద్ద హంగామా లేకున్నా.. బిగ్ బాస్ కు టీఆర్పీ రావడం లేదు.

ఇదిలా ఉండగా, బిగ్ బాస్ ఆరో సీజన్ ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. నాలుగో వారం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే హౌస్ నుంచి అభినయశ్రీ, సోలమన్ బయటకు వచ్చారు. తాజాగా మరొకరు కూడా ఇంటి నుంచి బయటకు రావడనికి సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. మూడో వారంలో హాట్ యాంకర్ నేహ చౌదరి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.

తక్కువ ఓట్లు రావడం తో పాటు ఆమె చేసిన తప్పుల కారణంగా ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దీనిపై ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ రానుంది. కాగా నేహ చౌదరి ప్రముఖ న్యూస్ ఛానల్ మహా న్యూస్ లో యాంకర్ గా కెరియర్ ప్రారంభించింది. అనంతరం సాక్షి, హెచ్ఎంటీవీ, ఎన్టీవీ, వనిత టివి, మా మ్యూజిక్ వంటి ఛానల్స్ లో పని చేసింది. 2019 సైమా అవార్డ్స్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించింది. వీటితో పాటు ప్రో కబడ్డీ, ఐపీఎల్, ఐసీసీ వరల్డ్ కప్ లకు కూడా యాంకర్ గా చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు