Revanth : నా వల్లే ప్రాబ్లమ్ అయితే నన్ను పంపించేయండి

టెలివిజన్ హిస్టరీలో మోస్ట్ పాపులర్ షో అయిన బిగ్ బాస్.. సీజన్ 6 సెప్టెంబర్ 6 నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేవంత్, పింకి, చలాకి చంటి, రోహిత్, మెరీనా, ఫైమా తో సహా మొత్తం 21 మంది సభ్యులు ఇంట్లో ఉన్నారు. బిగ్ బాస్ అంటేనే హౌస్ సభ్యుల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతాయి. నిన్నటితో ఐదో ఎపిసోడ్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే చాలా గొడవలు జరుగుతున్నాయి. రేవంత్ పై చాలా మంది కంటెస్టెంట్లు అసహనంతో ఉంటున్నారు. ఇప్పటికే జరిగిన నామినేషన్లలో రేవంత్ ను ఎక్కువ మంది నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఐదో ఎపిసోడ్ లో కూడా చిన్న పాటి గొడవ జరిగింది. అది ఏంటంటే.. హౌస్ మెట్స్ తో బిగ్ బాస్ డిస్పీ ప్లాస్ హాట్ స్టార్ గేమ్ ఆడించారు. ఇందులో సభ్యులును టీమ్ A, టీమ్ B గా విభజించారు. ఇందులో టీమ్ A లో రేవంత్, ఆరోహి ఉన్నారు. అయితే వీరు టీమ్ Bకి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఫైనల్ గా టీమ్ B లోకి ఆరోహి వెళ్లింది. ఈ గేమ్ లో టీమ్ B నే గెలిచింది. దీంతో తాను ఆరోహి వల్లే ఓడిపోయానని, ఆరోహి వల్లే తాను టీమ్ Bకి వెళ్లలేనని ఫైర్ అయ్యాడు. దీంతో రేవంత్ మాటలకు బాధ పడ్డా ఆరోహి.. తనతో మాట్లాడవద్దు అని రేవంత్ తో చెప్పింది.

దీంతో రేవంత్ కెమెరా ముందుకు వెళ్లి.. ”నేను ఏమన్నాను అని ఇంత రచ్చ జరిగింది. నా వల్లే ప్రాబ్లమ్ అయితే నన్ను పంపించేయండి. ఇలా నటిస్తూ ఒకరిని సంతోషపెట్టడం కోసం నన్ను నేను చంపుకోలేను. హౌస్ లో చాలా మంది గ్రూపులుగా ఆడుతున్నారు. నేను సింగిల్ గా ఆడుతా.. ఎన్ని రోజులు అయినా ఇలాగే ఉంటా. ఇలాంటి సిన్సియర్ పీపుల్ మధ్య నేను ఉండటానికి అర్హుడిని కాదు కావచ్చు. నన్ను ఈ నిమిషమే పంపిచండి బిగ్ బాస్. ఇలా యాక్ట్ చేస్తూ బతకలేను. ” చెప్పుకొచ్చారు.

- Advertisement -

అయితే చివరికి ఆరోహి.. రేవంత్ వద్దకు క్షమాపణలు కోరింది. దీంతో ఈ గొడవ ముగిసింది అని ఎవరూ అనుకోలేరు. ఈ గొడవ వచ్చే నామినేషన్ ప్రక్రియపై ప్రభావం చూపించవచ్చు. దీంతో పాటు ఆది రెడ్డి – రేవంత్ మధ్య కూడా గొడవ జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు