Salman : మాజీ ప్రియురాలితో..

బాలీవుడ్ లో పెళ్లి కాకుండా బ్యాచలర్ గా మిగిలిపోయిన వాళ్ల లిస్ట్ తీస్తే.. అందులో సల్మాన్ ఖాన్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. 56 ఏళ్ల వయసు ఉన్న ఈ కండల వీరుడు ఇంకా పెళ్లి పీటలెక్కలేదు. అయితే సల్మాన్ ఇప్పటి వరకు పలువురు హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడని గుస గుసలు ఇప్పటికీ కూడా వినిపిస్తున్నాయి. అలా వార్తలు వచ్చిన వారిలో కత్రినా కైఫ్ ఒకరు.

చాలా రోజుల క్రితం సల్మాన్, కత్రినా చట్ట పట్టా లేసుకొని తెగ షికార్లు కొట్టారని ప్రచారం సాగింది. ఇద్దరు చాలా కాలం రిలేషన్ షిప్ లో ఉన్నారు. కానీ వీరు పెళ్లి పీటల వరకు రాకముందే విడిపోయారు. దీని తర్వాత కత్రినా కైఫ్.. రణబీర్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ఇది బ్రేక్ అప్ అయిన తర్వాత చివరికి యంగ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడిపి గతేడాది వివాహం చేసుకుంది. ఇదిలా ఉండగా, మాజీ ప్రేమికులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒక స్టేజ్ పై కనిపించబోతున్నారు.

బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 16కు ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ కు హోస్ట్ గా చేయడం సల్మాన్ కు ఇది పదమూడోసారి. ఇదిలా ఉండగా తాజా ఎపిసోడ్ కు గెెస్ట్ గా కత్రినా కైఫ్ రాబోతుంది. తాను ముఖ్య పాత్రలో నటిస్తున్న ఫోన్ బూత్ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కత్రినా కైఫ్ బిగ్ బాస్ కు రాబోతుంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో కూడా విడుదలైంది. ఈ ప్రోమోలో ఈ మాజీ ప్రేమికులు కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేశారు. అది ప్రోమోకు హైలైట్ గా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు