Urfi Javed : ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

టీవీ నటి, బిగ్ బాస్ ఓటిటి ఫేమ్ ఊర్ఫీ జావిద్.. సినీ లవర్స్ కి ఈ పేరుని కొత్తగా పరిచయం చేయవలసిన అవసరమేలేదు. బిగ్ బాస్ సీజన్ ద్వారా తన పేరుని మరింత పాపులర్ చేసుకున్న ఈ బ్యూటీ తన అంద చందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కనువిందు చేస్తూ ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ పేరుతో హద్దులు దాటి అశ్లీలంగా కనిపిస్తోందని నేటిజన్లు ఆమెను నిత్యం ట్రోల్ చేస్తూనే ఉంటారు. బిగ్ బాస్ ఓటిటి షోలో కూడా ఊర్ఫీ అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకాడ లేదు.

అయితే ఒకసారి ఊర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో ఆమె ఎదుర్కొనే ట్రోలింగ్, బెదిరింపుల వ్యవహారం గురించి బయట పెట్టింది. ఎప్పుడు ట్రోలింగ్ చేయడం.. తనను పిచ్చిదాని  మాదిరిగా చేస్తోందని, దానివల్ల చాలా ఏడుస్తున్నానని చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసే ఆలోచనలు కూడా కలిగి ఉన్నానని చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బాలీవుడ్ నటి.. తాను అప్పుల్లో పీకల్లోతులో మునిగిపోయానని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షోలోకి వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో అప్పులు చేసి మరి దుస్తులు, వస్తువులను కొన్నట్లు పేర్కొంది. గత ఎనిమిది సంవత్సరాల నుంచి తాను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు వెల్లడించింది. లక్నోకు చెందిన ఈ 24 ఏళ్ల యువతీ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు